Friday, December 20, 2024

అమెరికాలో ఆకట్టుకున్న అయోధ్య రాముడి ప్రకటనలు

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై ఇండియాలోనే కాదు… దేశదేశాల్లో కూడా ప్రచారం సాగుతోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బిల్ బోర్డులపై జనవరి 22న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నట్లుగా ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది హిందువులు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై భారీయెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్, టెక్సాస్, న్యూ జెర్సీ  తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఇలా బిల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

న్యూ యార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం మోదీ ప్రసంగాన్ని కూడా టైమ్ స్కైర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య ఆలయంలో జనవరి 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏడువేల మంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News