- Advertisement -
అయోధ్య రామమందిరంలో రేపటినుంచి బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ నేపథ్యంలో రామ మందిరం ఎలా ఉంది? ఎత్తు ఎంత? వెడల్పు ఎంత వంటి విశేషాల గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం ఇదిగో ఆ వివరాలు…
అయోధ్య రామమందిరాన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సొంపూరా డిజైన్ చేశారు. ఆయన కుమారుడు ఆశిష్ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించాడు.
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అందించిన వివరాల ప్రకారం…
- ఆలయాన్ని సాంప్రదాయక నగర శైలిలో నిర్మించారు. రామ జన్మభూమి మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.
- మందిరంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. మొత్తం భవనంలో మూడు అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. స్తంభాలపై దేవతల చిత్రాలను అందంగా చెక్కారు.
- గర్భగుడిలో బాలరాముడి విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటాయి.
- Advertisement -