- Advertisement -
అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం వేళలను పొడిగించారు. ఆలయాన్ని ఇక ఉదయం 7 గంటలకు బదులుగా 6 గంటలకే తెరుస్తారు. సవరించిన హారతి సమయాలతో సహా కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ మీడియా కేంద్రం తెలియజేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, భక్తులు శృంగార్ హారతి తరువాత ఉదయం 6.30 గంటల నుంచి 11.50 వరకు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయాన్ని అప్పుడు రాజ్ భోగ్ హారతి కోసం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6.50 గంటల వరకు దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు సంధ్య హారతి నిర్వహిస్తారు. భక్తులకు దర్శనాన్ని రాత్రి 9.45 గంటల వరకు అనుమతిస్తారని, అటుపిమ్మట రాత్రి 10 గంటల తరువాత ఆలయాన్ని మూసివేస్తారని ట్రస్ట్ తెలిపింది.
- Advertisement -