Friday, January 24, 2025

ఏడాది ఆరంభం అంతారామమయం

- Advertisement -
- Advertisement -

అయోధ్య (ఉత్తరప్రదేశ్) : అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం వచ్చే ఏడాది (2014) జనవరి 21 నుంచి మూడురోజులు సాగుతుంది. ఈ విషయాన్ని రామ మందిర ధర్మకర్తల మండలి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు. 21, 22,23 తేదీలలో చూడముచ్చటగా మూడురోజులు ఈ ప్రతిష్టాపన ఉత్సవం జరుగుతుంది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని అతిధిగా అధికారికంగా ఆహ్వానిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిష్టాపన ఉత్సవానికి తేదీల ముహుర్తం ఖరారు చేశారని, ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రతిష్టగల సాధువులు, ఇతర ప్రముఖులు హాజరవుతారని చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా కేవలం ధార్మికంగా, సాంప్రదాయక రీతిలో ఉంటుందని , వివిధ రాజకీయ పార్టీల నేతలను రాజకీయాల ప్రమేయం లేకుండా ఉండే షరతులతో ఆహ్వానిస్తారని చెప్పారు.

ఈ ఉత్సవంలో ఎటువంటి వేదికలు ఉండవు. బహిరంగ సభల నిర్వహణ కూడా జరగదు. 25వేల మంది హిందూ మత పెద్దలను, 136 సనాతన సంప్రదాయాల వారిగా ఎంచుకుని ఆహ్వానించనున్నారు. కార్యక్రమానికి ఎంచుకున్న సాధువుల జాబితాను త్వరలో రూపొందిస్తారు. వీరికి ఆహ్వానాలను ట్రస్టు అధ్యక్షులు మహంత్ నిత్యాగోపాల్ దాస్ సంతకాలతో పంపించడం జరుగుతుంది. కార్యక్రమానికి పదివేల మంది ప్రత్యేక అతిధులు వస్తారు. వీరు కాకుండా ఇక్కడికి వచ్చే పాతికవేల మంది సాధువులు , మతపెద్దలు విడిగా రామజన్మభూమి ఆవరణ అంతర్భాగంలో ఆసీనులు అవుతారు. ఇప్పుడు రామ మందిర పనులు దాదాపుగా పూర్తికావచ్చినట్లే అని, జనవరిలో ప్రాణ ప్రతిష్ట మహాఘట్టానికి పనులు వేగవంతం చేస్తున్నామని ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు నెలరోజుల పాటు ఉచిత ఆహారం అందించేందుకు ట్రస్టు ఏర్పాట్లు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News