Wednesday, January 22, 2025

స్టీల్, సిమెంట్ వాడకుండా రామ మందిరం.. వెయ్యేళ్లు మన్నేలా నిర్మాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ లల్లా లేదా బాల రాముని కోసం నిర్మించిన బృహత్ ఆలయం సాంప్రదాయక భారతీయ వారసత్వ వాస్తు కళా మిశ్రమం. సైన్స్ కలగలిపి నిర్మించిన ఆలయం శతాబ్దాల తరబడి మన్నిక కలది. ‘వేల సంవత్సరాలకు మించి మన్నేలా ఆలయ నిర్మాణం జరిగింది’ అని అయోధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుత కట్టడంలా నిలిపేందుకు అగ్రశ్రేణి భారతీయ శాస్త్రవేత్తలు తోడ్పాటు అందించారని, తుదకు ఇస్రో సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఆలయంలో తగిన విధంగా వినియోగించమైందని మిశ్రా తెలిపారు. ఆలయ వాస్తు కళా రూపకల్పనను చంద్రకాంత్ సోమ్‌పుర నగర శైలి లేదా ఉత్తర భారత ఆలయ డిజైన్ల ప్రకారం చేయడమైంది.

సోమ్‌పుర ఒక కుటుంబ సంప్రదాయంగా వారసత్వ ఆలయ కట్టడాలకు రూపకల్పన చేస్తున్నారు. ఆ సంప్రదాయం 15 తరాలుగా సాగుతున్నది. ఆ కుటుంబం వందకు పైగా ఆలయాలకు రూపకల్పన చేసింది. ‘శ్రీరామ్ ఆలయం వాస్తుకళా చరిత్రలో భారత్‌లోనే కాకుండా ఈ విశ్వంలో మరే ప్రదేశంలోనైనా రూపొందించిన అద్భుత సృష్టి’ అని పోమ్‌పుర తెలియజేశారు. మొత్తం ఆలయ విస్తీర్ణం 2.7 ఎకరాలని, బిల్టప్ ప్రాంతం 57 వేల చదరపు అడుగులని, అది మూడు అంతస్తుల కట్టడం అని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఇనుము జీవిత కాలం కేవలం 80, 90 ఏళ్లు కనుక ఆలయంలో ఇనుమును లేదా ఉక్కును వాడలేదని ఆయన తెలిపారు. ఆలయం ఎత్తు 161 అడుగులు లేదా కుతుబ్ మినార్ ఎత్తులో 70 శాతం. ‘అత్యుత్తమ నాణ్యమైన గ్రాపైట్, సాండ్‌స్టోన్, పాలరాయిని వినియోగించడమైంది.

కూడళ్లలో సిమెంట్‌ను గానీ, సున్నపు రాయిని గానీ వాడలేదు. మొత్తం ఆలయ నిర్మాణంలో అంచులు, మలుపుల వద్ద గట్టి అతుకు యంత్రాగాన్ని వినియోగించాం’ అని రూర్కీలోని కేంద్ర భవన పరిశోధన సంస్థ (సిబిఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్‌చర్ల వివరించారు. ఆయన ఆలయ నిర్మాణ ప్రాజెక్ట్‌లో చురుకుగా పాల్గొన్నారు. మూడు అంతస్తుల కట్టడానికి 2500 ఏళ్ల పాటు భూకంపాన్ని తట్టుకునేలా రూపకల్పన చేయడమైంది. ఒక దశలో ఆలయ ప్రదేశం సమీపంలో సరయు నది ప్రవహించినందున, ఆలయం కింద నేల ఇసుకమయంగా, నిలకడలేనిదిగా విశ్లేషణలో తేలిందని, అది ఒక ప్రత్యేక సవాల్ విసిరిందని మిశ్రా చెప్పారు.

కానీ ఆ సమస్యలకు దేశీయ పరిష్కారాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఆయన తెలిపారు. ముందుగ మొత్తం ఆలయం కోసం నేలను 15 మీటర్ల లోతు వరకు తవ్వారు. ’12, 14 మీటర్ల లోతు వరకు ఆ ప్రాంతంలో ఇంజనీర్డ్ మట్టి వేశారు. ఉక్కు కడ్డీలు వేటినీ ఉపయోగించలేదు. 47 లేయర్ల పునాదులను గట్టి రాతి మాదిరిగా పటిష్ఠం చేయడమైంది’ అని రామన్‌చర్ల వివరించారు. దానికి పైన 1.5 మీటర్ మందంతో ఎం=35 గ్రేడ్ లోహ రహిత కాంక్రీట్ అరను పటిష్ఠత కోసం వేయడమైంది. పునాదిని మరింత దృఢతరం చేయడానికి దక్షిణాది నుంచి తరలించిన 6.3 మీటర్ల మందం సాలిడ్ గ్రానైట్ రాయిని వేశారు.

సందర్శకులు కనిపించే ఆలయంలో కొంత భాగాన్ని ‘బన్సీ పహార్‌పూర్’గా పేర్కొనే గులాబీ సాండ్‌స్టోన్‌తో నిర్మించారు. ఆ రాతిని రాజస్థాన్ నుంచి తరలించారు. సిబిఆర్‌ఐ సమాచారం ప్రకారం, నేల అంతస్తులో మొత్తం 160 కాలమ్‌లు, మొదటి అంతస్తులో 132, రెండవ అంతస్తులో 74 కాలమ్‌లు అమర్చారు. వాటిని సాండ్‌స్టోన్‌తో తయారు చేశారు. సాలంకృత గర్భగుడిలో రాజస్థాన్‌ల నుంచి తరలించిన మక్రానా పాలరాతిని అమర్చారు. తాజ్ మహల్‌ను మక్రానా గనుల తరలించిన పాలరాతితో నిర్మించడం ఈ సందర్భగా ప్రస్తావనార్హం. ‘రమారమి 50 కంప్యూటర్ మోడళ్లను విశ్లేషించిన తరువాత నగర వాస్తు శైలి ప్రకారం ఎంపిక చేసిన నమూ నా అన్ని విధాల డృఢంగా ఉంటుంది. ్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News