Sunday, January 19, 2025

అయోధ్య రాముడి ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

అయోధ్యలోని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం తాలూకు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ నాయకుడు ప్రకాశ్ జవడేకర్ ట్విటర్ లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ఐదేళ్ల వయసులో ఉన్న బాలరాముడి 51 అంగుళాల ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం గురువారంనాడే గర్భగుడికి చేరిన విషయం తెలిసిందే. వేదమంత్రోచ్చారణల మధ్య బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. మొదట గణేశ పూజ, వరుణ పూజ నిర్వహించి, గర్భగుడి ఆవల వాస్తుపూజ చేశారు.

గురువారంనాడు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి, విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. ఈనెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగాక, ప్రధాని మోదీ ఈ గంతలను విప్పి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. మరుసటి రోజునుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News