పెద్దేముల్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. జగమంతా రామమయంగా మారింది. 500 ఏళ్ళ హిందూవుల కళనేరవబోయిన ఈ శుభ సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా శ్రీరాముడిపై ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. అయితే వికారాబాద్ జిల్లా , పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రేగొండి సాయిమనోజ్ తనదైన శైలీలో రామభక్తిని ప్రదర్శించాడు. అగ్గిపుల్లలతో అయోధ్య రామమందిరాన్ని పోలిన నమూనా దేవాలయాన్ని రూపొందించాడు. సర్వంగా సుందరంగా అగ్గిపుల్లలతో దేవాలయ రూపాన్ని ఏర్పాటు తన రామ భక్తిని ప్రపంచానికి చాటాడు.
అగ్గిపుల్లలపై ఓంను లిఖించాడు. దేవాలయం శిఖరంపై జై శ్రీరామ్ పేరుతో కాషాయ జెండా రెపరెపలాడుతుంది. అగ్గిపుల్లలపై రేగొండి సాయిమనోజ్ రూపొందించిన అయోధ్య దేవాలయాన్ని చూసిన పలువురు సాయిమనోజ్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా సాయిమనోజ్ మాట్లాడుతూ.. భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగిన నేపథ్యంలో తన సూక్ష్మకళతో అగ్గిపుల్లలపై మందిరం నిర్మాణాన్ని రూపొందించానని తెలిపారు. అయోధ్యరామ మందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా సూక్ష్మకళతో దేవాలయాన్ని అగ్గిపుల్లలపై రూపొందించడం సంతోషంగా ఉందన్నారు.