Thursday, January 23, 2025

రామభక్తులతో కిటకిటలాడుతున్న టైమ్స్  స్క్వేర్ కూడలి!

- Advertisement -
- Advertisement -

న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామజపంతో మారుమోగుతోంది. అయోధ్యలో మరికాసేపట్లో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయనుండటంతో భక్తులు పెద్దయెత్తున టైమ్ స్క్వేర్ కూడలికి చేరుకున్నారు. భారతదేశానికి చెందిన భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి, జై శ్రీరామ్, జయహో రామ్ జీ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొందరు రాముడిపై పాటలు పాడుతున్నారు. చాలామంది శ్రీరాముడి బొమ్మ ఉన్న జెండాలు చేతబట్టుకున్నారు.

అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ మరి కొద్దిసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుక చూసేందుకు ఇప్పటికే ఏడువేల మందికి పైగా విఐపిలు అయోధ్య చేరుకున్నారు. సినీ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రణబీర్ కపూర్, అలియాభట్ తోపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా అయోధ్యకు వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News