Sunday, December 22, 2024

మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అయోధ్య ఆలయ ప్రవేశం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం లభించనున్నది. బాల రాముడి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీరాముడు జన్మించినట్లు హిందువులు విశ్వసించే అయోధ్యలోని రామాలయం కోట్లాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన ఫుణ్యక్షేత్రం. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కృష్ణ శిలపై మలచని 51 అంగుళాల ఎత్తైన బాల రాముడి విగ్రహం చుట్టూ విష్ణుష్ణుమూర్తి దశావతారాలతోపాటు హనుమతుడు, ప్రధాన హిందూ మత చిహ్నాలు కూడా ఉన్నాయి.

ఆలయ దర్శన సమయాలను, హారతి సమయాలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దాని ప్రకారం దర్శన మసయాలు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉన్నాయి. హారతి సమయాలఉ దయం 6.30 గంటలకు జాగరణ హారతి, సాయంత్రం 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటాయి. హారతి కోసం ఉచిత పాసులను ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్ ద్వారా పొందచ్చు. తగిన ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచిత ఆఫ్‌లైన్ పాసులను తీర్థ క్షేత్ర క్యాంపు ఆఫీసు నుంచి పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News