Thursday, January 23, 2025

31 నుంచి ఆయుష్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -
AYUSH Counselling from January 31
ఫిబ్రవరి 6 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం
నోటిఫికేషన్ జారీ చేసిన కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయుష్ వైద్య కోర్సులో యుజి ప్రవేశాలకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయుఎంఎస్, బీఎన్‌వైస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.In లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News