Sunday, December 22, 2024

నన్ను కుక్కతో పోల్చారు… నా పిల్లలు చూస్తే ఎలా?

- Advertisement -
- Advertisement -

ముంబయి: సినిమా రంగంలో వారసులు కొందరు సక్సెస్ అవుతారు, మరికొందరు విఫలమవుతారు. సక్సెస్ అయితే తండ్రి తగ్గ వారసుడు అని మెచ్చుకొంటారు, లేకపోతే మీడియా, అభిమానులు విమర్శలు గుప్పిస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని ఆయుష్ శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయుష్ శర్మ నటించిన లవ్ యాత్రి అనే సినిమాను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా పడడంతో ఆయుష్‌పై విమర్శలు గుప్పించారు. ఆయుష్‌కు బదులుగా కుక్కను పెట్టి సినిమా తీస్తే బాగుండని ట్రోల్ చేయడంతో అతడు చాలా బాధకు గురయ్యాడు. తాజాగా అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకొని బావోద్వేగానికి గురయాయడు. ఆ రోజు తనపై చెత్తగా ట్రోల్ చేశారని, తనని కుక్కతో పోల్చడం ఇబ్బంది ఏర్పడిందని, భవిష్యత్‌లో తన కుమారుడు ఈ వార్త చదివితే తన పరిస్థితి ఏంటని అడిగారు. కన్నతండ్రిని శునకంతో పోల్చితే తానేం కావాలి, తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలని పిల్లలకు ఉంటుందన్నారు. ఒక మీడియా అయితే తనని కుక్క అని రాసిందని, కానీ వాళ్లకు ఇప్పడు థ్యాంక్స్ చెబుతున్నానని, అవమానించడంతో ప్రస్తుతం తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యాడు. అంతిమ్ అనే సినిమాలో సల్మాన్‌తో నటించడంతో అది హిట్ ఇచ్చింది. ఇప్పుడు రుస్లాన్ అనే మూవీలో నటిస్తున్నాడు. రుస్లాన్ ఏప్రిల్ 26న ప్రేక్షకులు ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News