Wednesday, December 25, 2024

ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రే కూతురిని..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : గతవారం ఉత్తరప్రదేశ్ లోని మధురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపాన ఒక సూట్‌కేసులో 22 ఏళ్ల యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతని ఆమె కన్నతండ్రే హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఆయుషి చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశామని మధుర పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆయుషి చౌదరి తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేని మరోవర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తండ్రి నితీష్ యాదవ్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులకు కనీసం చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయి, ఛాత్రపాల్ అనే వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తండ్రి కోపంతో కాల్పులు జరిపాడు. ఆయుష్ చౌదరి ఢిల్లీలో కంప్యూటర్ అప్లికేషన్ చదువుకున్నారు.

సూట్‌కేసును స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోన్లు, సిసిటివి ఫుటేజీ పరిశీలించారు. సోషల్ మీడియా తోపాటు పోస్టర్ల ద్వారా మృతురాలిని గుర్తించడానికి ప్రయత్నించారు. అయితే ఆదివారం ఉదయం గుర్తు తెలియని కాల్ ద్వారా మృతురాలి గురించి గట్టి సమాచారం తెలిసింది. తరువాత మృతురాలి తల్లి, సోదరుడు ఫోటోల ద్వారా మృతురాలిని గుర్తించ గలిగారు. ఆ తరువాత దక్షిణ ఢిల్లీ బాదర్‌పూర్‌లో ఉంటున్న తండ్రిని అదుపు లోకి తీసుకుని ప్రశ్నించారు. తండ్రి నితీష్ యాదవ్ తుపాకీతో కాల్పులు జరిపిన తరువాత కుమార్తె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి మధురలో పారేశారని తేలింది. తండ్రి నుంచి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News