Saturday, November 16, 2024

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు… ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్పు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పేరు మార్చిన తర్వాత ఆ ఫొటోలను ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెలెనెస్ సెంటర్స్ పోర్టల్లో అప్‌లోడ్ చేయాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా ఐదేళ్ల కితం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల వరకు వైద్యం అందించేందుకు దేశంలోని 50 కోట్ల మందికి 1393 రకాలైన వ్యాధులకు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News