Sunday, December 22, 2024

తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను కట్టారు?: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను నిర్మించి ఇచ్చారో సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రాలో పేదలకు ఆవాస్ యోజన కింద 15 లక్షల 32 వేల ఇండ్లను అక్కడి ప్రభుత్వం కట్టించిందన్నారు. మహారాష్ట్రలో ఆయుష్మాన్ భారత్ కింద కోట్లాదిమంది ప్రజలకు రోగమొస్తే పైసా భారం లేకుండా కార్పోరేట్ వైద్యం అందుతుందన్నారు. అయితే తెలంగాణలో ఏమి చేశారో బిఆర్‌ఎస్ పాలకులు చెప్పాలన్నారు. ఫార్మా, ఐటీ రంగాల్లో కూడా తెలంగాణను మహారాష్ట్ర మించిపోయిందన్నారు.

నరేంద్ర మోడీ ప్రధామంత్రి అయ్యాక భారత్ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో మిగులు రాష్ట్రం కాస్తా రూ.5 లక్షల కోట్ల అప్పులపాలైందన్నారు. శివాజీ జన్మస్థలం నుంచి బిఆర్‌ఎస్ పార్టీ యాత్రలను ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. నాందేడ్‌లో బిఆర్‌ఎస్ సభ నిర్వహించేందుకు 25 రోజులుగా ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు పనిచేసి ఏర్పాటు చేసినా అట్టర్‌ప్లాప్ అయ్యిందని ఆయన విమర్శించారు. తెలంగాణలోనే బిఆర్‌ఎస్‌ను ఎవరూ పట్టించుకోరని, నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ను ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News