- Advertisement -
న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలతో ఆరోగ్యబీమా కల్పిస్తోంది. ఇప్పటికే 16.5 కోట్ల కుటుంబాలకు ఈ కార్డుల పంపిణీ పూర్తయింది. దేశ వ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా ఆరోగ్యబీమా రక్షణ కల్పిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు 2.19 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరింది.
- Advertisement -