Monday, December 23, 2024

సుప్రీంలో అయ్యన్నపాత్రుడికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సుప్రీంకోర్టులో టిడిపి నేత అయ్యన్న పాత్రుడికి చుక్కెదురైంది. అయ్యన్నపాత్రుడిపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీం అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సి టి రవి కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ ఐపిసి 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫోర్జరీ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేసింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. భవనం ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో టిడిపి నేత అయ్యన్న పాత్రుడిపై ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News