Wednesday, January 22, 2025

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

స్పీకర్ పదవికి ఒకే నామినేషన్

రేపు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు!

అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇవాళ, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. 1983 లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎంఎల్ఏగా గెలుపొందారు. ఏడు పర్యాయాలు ఎంఎల్ఏగా గెలిచిన ఆయన, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News