Friday, January 24, 2025

ఎపి శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎంఎల్ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. సభాపతి స్థానానికి అయ్యన్నను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌లు తీసుకెళ్లారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 1957లో జన్మించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కాకినాడలోని పిఆర్ కాలేజీలో బిఎ చదువుకున్నాడు .1983లో తొలి సారి ఎంఎల్ఎగా గెలిచారు. ఏడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచి మూడు సార్లు సాంకేతిక విద్యాశాఖ, రహదారుల భవనాల శాఖ, అటవీ శాఖ మంత్రిగా సేవలందించారు. 1996-1998 మధ్య 11వ లోక్‌సభలో సభ్యుడిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News