Wednesday, January 22, 2025

కేంద్ర పెద్దల మౌనం దేనికి సంకేతం?: అయ్యన్నపాత్రుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనబడటంలేదా? అని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు జైళ్లో ఉండడంతో అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టులో ఢిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడటం లేదా? అని ఆరోపణలు చేశారు. కేంద్ర పెద్దల మౌనం దేనికి సంకేతం అని, కేంద్రం ఇచ్చే నిధులు స్వాహా చేస్తున్న సిఎం జగన్ మోడీ ప్రభుత్వానికి కనిపించడంలేదా? అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఎపిలో వ్యవస్థలన్నీ దిగజారి పని చేస్తున్నాయని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దౌర్భగ్యం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. బాబుతో నేను పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. మండల, నియోజకవర్గ, రాష్ట్రా స్థాయిలో టిడిపి రిలే దీక్షలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News