Monday, December 23, 2024

శబరిమల వెళ్లి వస్తుండగా అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా..

- Advertisement -
- Advertisement -

పతనంథిట్ట: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్పస్వామి భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని లాహ వద్ద బోల్తా పడింది. మలుపు తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడితో పాటు 20 మందికి పైగా గాయపడ్డారు. ఏలూరుకు చెందిన అయ్యప్ప దీక్ష ధరించిన భక్తులు శబరిమల నుంచి తిరిగి రెండు బస్సులలో బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని, బోల్తా పడ్డ బస్సులో మొత్తం 44 మంది ఉన్నారని స్థానిక జిల్లా అధికారులు తెలిపారు. వాహనంలోని వారిని అందరిని సురక్షితంగా బయటకు తీసినట్లు, ప్రాణాపాయం ఎవరికీ లేదని చెప్పారు.

అయితే ఓ ఎనిమిదేళ్ల బాలుడికి మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయని వీరిని వెంటనే కొట్టాయం వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు వివరించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని సమీపంలోని పెరినాడు ఇతరప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాలలో చేర్పించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జి ఘటనాస్థలికి చేరుకుని తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. గాయపడ్డ వారికి తగు చికిత్స జరుగుతోందని వివరించారు. జిల్లా కలెక్టరు, ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చారని వెల్లడైంది. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేరళ ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాబట్టుకున్నారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరాతీశారు.

Ayyappa devotees bus accident in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News