Monday, December 23, 2024

టిప్పర్‎ను ఢీకొట్టిన అయ్యప్ప భక్తుల బస్సు: ఇరవై మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

 

ఒంగోలు: అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సు టిప్పర్ ను ఢీకొనడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఒంగోలులో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బీఆర్ అంబేద్కర్ కోనసీం జిల్లా నుంచి కేరళ రాష్ట్రం శబరిమలకు శయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సు ఒంగోలు సమీపంలో టిప్పర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 20 మంది భక్తులకు గాయాలు కాగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News