Friday, December 27, 2024

కారు లోయలో పడి 8మంది అయ్యప్ప భక్తులు మృతి..

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు తేని జిల్లాలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. మృతుల్లో మైనర్ బాలుడు ఉన్నారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతులు షణ్ముగసముద్రం గ్రామానికి చెందినవారు. శబరిమల దర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి 40 అడుగుల లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే తేని, కేరళ పోలీసులు, అగ్నిమావక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. చీకటి, చలి కారణంగా సహాయక చర్యలకు ఆలస్యమైంది. చివరకు క్రేన్ల సహాయంతో కారును లోయలోనుంచి బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News