Monday, January 20, 2025

బోధన్‌లో వైభవోపేతంగా అయ్యప్ప పడిపూజ

- Advertisement -
- Advertisement -

బోధన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇందూరు విద్యాసంస్థల అధినేత కొడాలి కిశోర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ మహరాజ్ వేదమంత్రోచ్ఛరణాల మధ్య అయ్యప్పస్వామి పడిపూజను వైభవంగా జరిపారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, సాయంత్రం పుష్ఫార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 18 మెట్లను వెలిగించి కర్పూర హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల భజనలతో ఆలయం మారుమోగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు శాస్త్రప్రీతి ఏర్పాటుచేశారు. ఈ పడిపూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News