Friday, November 22, 2024

జూబ్లీహిల్స్ టికెట్‌పై రగడ

- Advertisement -
- Advertisement -

అజారుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వార్

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ టికెట్‌పై కాంగ్రెస్‌లో రగడ కొనసాగుతోంది. హైదరాబాద్ పరిధిలో కీలక నియోజకవర్గమైన ఇక్కడ నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతల మధ్య వార్ నడుస్తోంది. పిజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి ఎప్పటినుంచో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తనకే సీటు వస్తుందని ఆయన భావించారు. కానీ, ఈ మధ్యన ఈ నియోజకవర్గంలోకి మాజీ ఎంపి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో నేతల మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పోటీకి సిద్ధమవుతున్నారు. తాజాగా యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి జూబ్లీహిల్స్ టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి వస్తుందనేది త్వరలోనే తేలుతుందని, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన కాంగ్రెస్ నాయకుల ఎదుట ధీమా వ్యక్తం చేశారు.
విష్ణువర్దన్ రెడ్డి అనుచరుడు భవానీ శంకర్‌తో..
2009 ఎన్నికల్లో విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి చెందారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా తనకే టికెట్ దక్కుతుందని విష్ణువర్దన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా అజారుద్దీన్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండడంతో విష్ణువర్దన్ రెడ్డి వర్గానికి ఈ విషయం మింగుడుపడడం లేదు. ఇటీవల విష్ణువర్దన్ రెడ్డి అనుచరుడు భవానీ శంకర్‌తో అజారుద్దీన్ భేటీ అయ్యారు. దీంతో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఫిక్స్ చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News