న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు. ‘హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆజం ఖాన్ సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు గంగారామ్ ఆసుపత్రిలో చేరారు’ అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఆయన రామ్‌పూర్ సదర్ నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు.
ఆజం ఖాన్ విద్వేష ప్రసంగం చేసినందుకు కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం అక్టోబర్ మొదట్లో ఆయనపై అనర్హత వేటు వేసింది.రామ్‌పూర్‌లోని పాలక అధికారులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లపై ఎన్నికల సమావేశాల్లో తీవ్ర ఆరోపణలు చేశారంటూ ఆజం ఖాన్‌పై 2019 ఏప్రిల్‌లో కేసు నమోదయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతనగరియా గ్రామంలో ఓ బహిరంగ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు బుక్ అయ్యారు. వక్ఫ్ బోర్డు భూమిని అనధికారికంగా కలిగి ఉన్న కేసులో ఆజం ఖాన్‌కు అలహాబాద్ హైకోర్టు 2022 మేలో తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది.