Friday, December 20, 2024

క్షీణించిన ఆజంఖాన్ ఆరోగ్యం…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఈనెల 20న సీతారాంపూర్ జైలు నుంచి విడుదలైన సమాజ్ వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం ఒక్కసారిగా శనివారం అర్థరాత్రి క్షీణించింది. దీంతో ఆయనను అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్చారు. ఛాతి నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని, దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని ఆజంఖాన్ సన్నిహితులు తెలిపారు. ఛీటింగ్ కేసు, భూ కబ్జాలతో సహా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 27 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. సుప్రీం కోర్టు ఆయన కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

Azam Khan admitted to Hospital in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News