- Advertisement -
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌ను ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు శిక్ష ఖరారు చేయనున్నది. 2019లో ప్రధాని నరేంద్రమోడీ, యోగి ఆదిత్యనాధ్, అప్పటి ఐఎఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన క్రమంలో ఇటీవలే జైలు నుంచి ఆజంఖాన్ విడుదలయ్యారు. అయితే మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తరువాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
Azam Khan Convicted in Hate Speech Case
- Advertisement -