Thursday, January 23, 2025

అజారుద్దీన్ సెప్టెంబర్ వరకే హెచ్‌సిఎ అధ్యక్షుడు: జస్టిస్ కక్రూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముహమ్మద్ అజారుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 2022లోనే ముగిసింది. అయితే ఆయన కొనసాగాలా లేక అక్కడితో ఆగిపోవాలా అన్న విషయాని సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీకి ఏమీ తెలుపలేదని ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) నిసార్ అహ్మద్ కక్రూ తెలిపారు. ప్యానెల్‌లోని ఇతర సభ్యులైన అంజనీ కుమార్(యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్), మాజీ క్రికెటర్లు ఎస్.ఎల్. వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌లకు నవంబర్ 24న జస్టిస్ కక్రూ ఈ విషయాన్ని వివరిస్తూ లేఖలు రాశారు.

నియమాలు పాటించకపోవడం(నాన్‌కాంప్లియెన్స్):
కక్రూ తన లేఖలో ‘అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ తప్పుచేశాడని చెప్పకుండానే, ఆయన కొనసాగింపు నియమాలకు వ్యతిరేకంగా ఉండడం తప్పు అన్నారు. ఆయన ఏ విషయాన్ని పర్యవేక్షక కమిటీ దృష్టికి తీసుకురాలేదన్నారు. తద్వారా ఆయన తన కొనసాగింపును కొనసాగించుకున్నారన్నారు. కనుక, ఇకపైన అతడిని మాజీ అధ్యక్షుడు అనాలి’ అని పేర్కొన్నారు.
హెచ్‌సిఎ తాత్కాలిక సంఘం ఏర్పాటు చేయాలని ఓ సభ్యుడు చేసిన ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని జస్టిస్ కక్రూ తెలిపారు. ఎందుకంటే అటువంటి ప్యానెల్ రాజ్యాంగం పర్యవేక్షణ కమిటీ అధికార పరిధిలో లేదు. తెలంగాణలోని 33 జిల్లాలకు సభ్యత్వం ఇవ్వాలని పర్యవేక్షక కమిటీ తీర్మానించిందన్న అంజనీ కుమార్ లేఖపై తాను సంతకం చేయనని చెప్పారు. “సమావేశాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ పిలిచారో నాకు తెలియదు. దాని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇది నాకు కొరుకుడు పడని విషయం(గ్రీకు)” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News