Thursday, October 24, 2024

పిల్లల్లో ఇండియా టైప్ కొవిడ్

- Advertisement -
- Advertisement -

B.1.617 variant affects children more

సింగపూర్‌లో స్కూళ్ల మూసివేత

సింగపూర్ : కొత్త రకం కరోనా భయాలతో సింగపూర్‌లో బుధవారం నుంచి స్కూళ్లన్నింటిని మూసివేయనున్నారు. భారత్‌లో తలెత్తిన తీవ్రస్థాయి కరోనా కొత్త స్ట్రెయిన్ వంటివి ఇక్కడ కూడా పిల్లలలో తలెత్తుతుండటంతో కట్టడి చర్యల్లో భాగంగా స్కూళ్ల మూసివేత నిర్ణయం తీసుకున్నారని అధికారులు సోమవారం తెలిపారు. సింగపూర్‌లో ఇటీవలి కాలంలో కరోనా కేసులు దాదాపుగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సరికొత్త నమూనా వైరస్ సోకిందని, ఇది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని తేలింది. దీనితో స్కూళ్ల మూత నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఒక్కరోజే సింగపూర్‌లో వివిధ ప్రాంతాల్లో కొత్త రకం వైరస్ కేసులు దాదాపుగా 38వరకూ వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది నెలల కాలంలో రోజువారి లెక్కలో ఈ సంఖ్య అత్యధికం అయింది. పిల్లలు ట్యూషన్ కేంద్రాల వద్ద ఉంటున్న దశలో ఎక్కువగా ఇటువంటి కొత్త స్ట్రెయిన్‌లకు గురి అవుతున్నట్లు నిర్థారించారు.

ఇండియాలో విపరీత నష్టం కల్గిస్తోన్న బి 1.617 రకం పిల్లల్లో కనబడుతోందని గుర్తించారు. ప్రస్తుత పరిస్థితిపై సింగపూర్ ఆరోగ్య మంత్రి ఒంగ్ యె కుంగ్ సంబంధిత వైద్యాధికారులతో సమీక్షించారు. వెంటనే విద్యాశాఖ మంత్రి ఛన్ ఛున్ సింగ్‌తో మాట్లాడారు. కొన్ని రకాల మ్యుటేషన్స్ పిల్లలకు ఎక్కువగా సోకుతున్నాయని దీనితో స్కూళ్లను మూసివేయడం మంచిదని భావించినట్లు విద్యా శాఖ మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. పిల్లలకు ఈ మ్యుటేషన్ అంటుకోవడం ఆందోళనకర పరిణామమని మంత్రి చెప్పారు. ఇప్పటివరకూ ఈ కొత్త రకం కరోనాసోకిన పిల్లల్లో ఎవరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని, చికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో 15 ఏండ్ల లోపు బాలలకు టీకాలు వేయించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సరికొత్త రకం వైరస్ తలెత్తడంతో తైవాన్‌లో కూడా స్కూళ్లను మూసివేశారు. ఇప్పుడీ బాటలో సింగపూర్ వెళ్లుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News