చేవెళ్ల, వనపర్తి, బోధ్ నియోజకవర్గాల అభ్యర్థులకు అందని సమాచారం
ముగ్గురిని మార్చే అవకాశం
గాంధీభవన్‌లో 60మందికి బిఫాంల అందజేత
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద సందడి నెలకొంది. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులకు బిఫాంలను ఆదివారం పం పిణీ చేశారు. సుమారుగా 60 మందికి పైగా అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు గాంధీభవన్ వచ్చి బిఫాంలను తీసుకెళ్లారు. అయితే చేవెళ్ల, వనపర్తి, బోథ్ నియోజకవర్గ అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదని వారికి బి ఫాంలను నిలిపివేయాలని అధిష్టానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆదివారం సమాచారం అందడంతో ఈ మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆదివారం గాంధీభవన్‌లో ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, ఉపాధ్యక్షులు నిరంజన్ అభ్యర్థులకు ఈ బి ఫాంలు పంపిణీ చేశా రు.చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేష్ మొ దటి బి ఫాం తీసుకోగా ఈయనతో పాటు సి ర్పూ ర్ కాగజ్‌నగర్ అభ్యర్థి రావి శ్రీనివాస్, నిర్మల్ అ భ్యర్థి శ్రీహరి రావు తరపున ఆయన కూతురు బి ఫాం తీసుకోగా, సికింద్రాబాద్ కంట్మోనెంట్ ని యోజకవర్గం నుంచి గద్దర్ కూతురు వెన్నెల, జగిత్యాల అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు, రామగుండం అభ్యర్థి మకన్‌సింగ్ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు, కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి అనుచరులు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఈ బి ఫాంలను స్వీకరించారు. బి ఫాంల పంపిణీ నేపథ్యంలో గాంధీభవన్‌కు అభ్యర్థులు, వారి తరుపు కు టుంబ సభ్యులు భారీగా తరలిరావడంతో గాంధీభవన్ సందడిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు, సీనియర్లు నాయకులు ఈ బి ఫాంలను తీసుకెళ్లలేదు. వారంతా మంచి రోజు కోసం వేచి చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.