మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ అవార్డుల కమిటీకి ప్ర ముఖ దర్శకులు బి.నర్సింగరావు ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా దిల్‌రాజు వైస్ ఛైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది. కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్‌డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌డిసి ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.