Monday, January 20, 2025

అప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు… ఇప్పుడు 10 లక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు: సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

తన నియోజకవర్గంలో ఫార్మసీ కాలేజ్ శంకుస్థాపనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట అని, అన్ని రకాల చదువులతో ఈరో జు సిద్దిపేట జిల్లా విరాజిల్లుతోందని ప్రశంసించారు. మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యాలయాలు సిద్దిపేటకు అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. సిద్దిపేట ఒకటే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ప్రతి గ్రామం తెలంగాణలో అభివృద్ధి చెందుతుందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, అదే విధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ తొలి స్థానంలో ఉందని,  ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

Also Read: హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటి ఐటి అని మాత్రమే అనేవారని, అదే ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో హైదరాబాదులో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా పెరిగిందని, ఐటి ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 10 లక్షల ఐటి ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందని కొనియాడారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఎలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయో అదే విధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని, దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని బిజెపోళ్లకు చురకలంటించారు.

Also Read: చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు అడగడంలేదు: రోజా

దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, అభివృద్ధిలో సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిచే అందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతామని, ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని, హైదరాబాద్ లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని, ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతో మందికి విద్యను ఉపాధిని కల్పిస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News