Sunday, December 22, 2024

ఆ విషయం జగన్ కు చెప్పడంతోనే వివేకా హత్య: బీటెక్ రవి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్యపై మంగళవారం ఎపిసిసి ప్రెసిడెంట్ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని టిడిపి నేత బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. వివేకా హత్యపై సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. వివేకాను చంపితే ఎవరికి లాభం, మోటివ్ ఏంటని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారని, అయితే వివేకా హత్య కుట్ర గురించి షర్మిల కుండబద్దలు కొట్టారని బిటెక్ రవి అన్నారు. కడపనుంచి ఎంపీగా పోటీ చేయాలంటూ తనపై చిన్నాన్న ఒత్తిడి తీసుకొస్తే తాను ఒప్పుకున్నట్టు షర్మిల చెప్పారని, ఇదే విషయాన్ని వివేకా సిఎం జగన్‌కు చెప్పారని బిటెక్ రవి తెలియజేశారు. ఆ తరువాత జరిగిన అంతఃపుర రహస్యం అందరికీ తెలిసిందేనని అన్నారు. పోటీకి షర్మిల ఒప్పుకున్నాకే వివేకా హత్యకు కుట్ర జరిగిందని బీటెక్ రవి అన్నారు. అవినాష్ రెడ్డికి సిగ్గుంటే పోటీనుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీ పెట్టారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి రక్తపు మరకల పునాదులపై పుట్టిన పార్టీ అని మండిపడ్డారు. వివేకా హంతకులు జగన్ చుట్టే తిరుగుతున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News