Sunday, April 27, 2025

గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపుల కేసులో ఓ బీటెక్ స్టూడెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం గంభీర్ ను చంపేస్తానంటూ బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గంభీర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు..  గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌.. ‘ఐసిస్ కాశ్మీర్’ అనే మెయిల్ ఐడీతో ‘ఐ కిల్ యూ’ అంటూ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే, జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News