Monday, February 10, 2025

కేంద్రంపై సిపిఐ(ఎం) నేత బివి. రాఘవులు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మార్క్సిస్టు పార్టీ(సిపిఐఎం) నేత బివి. రాఘవులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రజా సమస్యలు చర్చకు రావడంలేదని అన్నారు. అదానీ కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్రం నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తక్షణమే అదానీ ముడుపుల అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాక కూడా 55 లక్షల ఓట్లు పోలయ్యాయని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందాయనే ఆరోపణలు వచ్చినా జగన్ ను ఈడి ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. అదానీతో కుమ్మక్కైన ఎవరినీ వదలకూడదని అన్నారు. కమ్యూనిస్టుల పార్టీగా తాము నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News