Sunday, January 19, 2025

ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ తీర్మానం

- Advertisement -
- Advertisement -

హస్తినలో అందజేసిన ప్రతినిధి బృందం చట్టప్రకారం పరిశీలించి అనుమతిస్తామన్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్
పేరు మార్చుకునే హక్కు పార్టీలకు ఉందన్న వినోద్‌కుమార్
ఆ మేరకు సమాచారాన్ని ఇసికి ఇస్తే సరిపోతుంది
కొత్తగా రిజిస్రే ్టషన్ అవసరం లేదని స్పష్టీకరణ
పార్టీ గుర్తు, రంగు యథాతథమని వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన టిఆర్‌ఎస్ పార్టీ.. బిఆర్‌ఎస్‌గా పేరు మార్పు ప్రక్రియను ఆ పార్టీ నేతలు ప్రారంభించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘంతో బి(టి)ఆర్‌ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి మావేశమయ్యారు. టిఆర్‌ఎస్ పా ర్టీని బిఆర్‌ఎస్‌గా పేరు మార్చుతూ ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన పార్టీ చేసిన తీర్మానం కా పీలు, సంబంధిత పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. పేరు మార్పును గుర్తించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, తమ పార్టీ చేసిన తీర్మానం కాపీని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందించామని చెప్పారు. చట్టప్రకారం పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారని వెల్లడించారు. మిగతా విషయాలు ఎలక్షన్ నిబంధనలు అనుసరించి ఉండబోతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మాత్రమే మార్చామని, కొత్తగా ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ పేరు మార్చుకునే హక్కు ఆయా పార్టీలకు ఉంటుందని, ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టంలోని సెక్షన్ 29 ఎ(9) ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందని అన్నారు. పార్టీ పేరు మార్చుకున్నప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుందని,అందుకే సమయం వృథా చేయకుండా తాము వెంటనే తమ పార్టీ చేసిన తీర్మాన పత్రాన్ని ఇసికి అందజేశామని తెలిపారు.
బిఆర్‌ఎస్ పార్టీ గుర్తు ‘కారు’… జెండా రంగు ‘గులాబీ’ అలాగే ఉంటాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిఆర్‌ఎస్ గుర్తింపు పొందిన పార్టీ అని, ఇక నుంచి జాతీయ స్థాయిలో పార్టీ అధికారికంగా విస్తృత స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని వివరించారు. టిఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని, ప్రజల ఆశీర్వాదాలతో కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో విజయాలు సాధించినట్లుగానే.. దేశాన్ని కూడా అదే మార్గంలోకి తీసుకెళ్లేందుకు కెసిఆర్ కెసిఆర్ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగనున్నారని తెలిపారు.

B Vinod Kumar meets ECI over BRS Party

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News