Sunday, November 17, 2024

జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలి

- Advertisement -
- Advertisement -

B Vinod Kumar's letter to Union Railway Minister Ashwini Vaishnav

ప్రాంతీయ భాషలోనే ఎంపిక పరీక్షలు నిర్వహించాలి
రైల్వే గ్రూప్ సి, డి కేటగిరి పోస్టులకు జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్షలు సరికాదు
రైల్వే రిక్రూట్ మెంట్ విధానం ప్రక్షాళన చేయాలి
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ

మనతెలంగాణ/ హైదరాబాద్: రైల్వే రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రక్షాళన చేసి జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్స్ జరపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. క్లర్క్ అండ్ అంతకు కింది స్థాయి పోస్టులకు జాతీయ స్థాయిలో పరీక్షలా..? ఇది విడ్డురమే అని ఆయన అన్నారు. జాతీయ స్థాయి పరీక్షల వల్ల బీహార్, యూపీ. రాష్ట్రాలదే పెత్తనం సాగుతోందన్నారు. ప్రాంతీయ భాషల రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైల్వే పరీక్షల కోసం ఉత్తరాదిలో కోచింగ్ కేంద్రాలు మాఫియా లాగా పని చేస్తోందని, ఉత్తరాది కోచింగ్ కేంద్రాల మాయాజాలంత్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు.

35 వేల రైల్వే పోస్టుల కోసం ఒక కోటి 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, రైల్వే రిక్రూట్ మెంట్ వ్యవహారంలో బీహార్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, విధ్వంసక పరిణామాలు చోటు చేసుకోవడం, చివరికి బీహార్ బంద్ వరకు వెళ్లడం వంటి సంఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని ఆయన వెల్లడించారు. వీటి దృష్టా కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్, మజ్దూర్ సంఘ్, రైల్వేమెన్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఈ విషయంపై తనతో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ప్రాంతీయ భాష తెలుగులో రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని వినోద్‌కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాషలోనే రైల్వే రిక్రూట్ మెంట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్‌మెంట్ విధానాన్ని తప్పు పడుతూ పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించానని ఆయన తెలిపారు. రైల్వే రిక్రూట్ మెంట్ ను జోనల్ స్థాయిలో ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని, ప్రస్తుత విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని వినోద్‌కుమార్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News