Wednesday, January 22, 2025

ఉడాన్‌పై 23 మిలియన్లకు పైగా ఆర్డర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఈ-బిజినెస్-టు-బిజినెస్ (ఇబి2బి) సంస్థ అయిన ఉడాన్ 2023లో తమ ప్లాట్‌ఫామ్ ద్వారా 23 మిలియన్లకు పైగా ఆర్డర్‌ల ద్వారా 2.25 బిలియన్లకు పైగా ఉత్పత్తులను రవాణా చేసినట్లు వెల్లడించింది. ఈ ఆర్డర్‌లు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ రవాణా జరిగాయి. ఎసెన్షియల్స్ కేటగిరీ (ఫ్రెష్, ఎఫ్‌ఎంసిజి, స్టేపుల్స్, ఫార్మా) కింద ప్లాట్‌ఫామ్ 20 మిలియన్ ఆర్డర్‌లను అందించింది. ప్లాట్‌ఫామ్ ద్వారా దాదాపు 10 లక్షల టన్నుల ఉత్పత్తులు రవాణా చేసింది. ఈ కాలంలో ప్లాట్‌ఫామ్‌లో 900 మంది అమ్మకందారులు ఒక్కొక్కరు రూ. 1 కోటి విలువైన అమ్మకాలను సాధించగా, దాదాపు 600 మంది విక్రేతలు ప్లాట్‌ఫామ్‌లో రూ. 2 కోట్ల విలువైన వ్యాపారం చేశారు. గుర్గావ్, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నుండి రిటైలర్లు నిత్యావసరాలు, విచక్షణ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News