Friday, November 22, 2024

ఒమిక్రాన్ కంటే ఉపరకం బిఎ2 ప్రమాదకరం కాదు : డబ్లుహెచ్‌వొ

- Advertisement -
- Advertisement -

BA.2 is no more dangerous than Omicron: WHO

జెనీవా : ఒమిక్రాన్ అసలు వేరియంట్ కంటే దాని ఉపరకం బిఎ2 మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) తాజాగా వెల్లడించింది. అనేక దేశాల ప్రజల నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించి ఒమిక్రాన్ ఉపరకాలు బిఎ1,2 మధ్య కూడా ఎలాంటి తీవ్రమైన వ్యత్యాసాలు లేవని డబ్లుహెచ్‌వొ సాంకేతిక విభాగాధిపతి మరియా వాస్ కెర్ఖోవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చాలా దేశాల్లో ఈ రెండు రకాలలోనూ తీవ్రమైన వ్యాప్తి కలిగిన లక్షణాలను గుర్తించామని, వాటిలో వ్యత్యాసాలు లేవని, ఒమిక్రాన్ అసలు, దాని ఉపవేరియంట్లు ఒకేరకమైన తీవ్రతను కలిగి ఉన్నాయని మరియా కెర్ఖోవ్ తెలిపారు.

వైరస్ లోని మ్యుటేషన్లను ట్రాక్ చేసే నిపుణుల కమిటీ నివేదించిన ఫలితాలను ఆమె వెల్లడించారు. ఈ నివేదికలతో బిఎ2 విపరీతంగా వ్యాపిస్తున్న డెన్మార్క్ వంటి దేశాలకు కాస్త ఉపశమనం కలిగినట్టయింది. మరియా కెర్ఖోవ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లను ఆమె ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ ’గా అభివర్ణించారు. ఒమిక్రాన్ తరువాత మరో వేరియంట్ వస్తే అది దీనికంటే ఎక్కువ శక్తి సామర్ధాలను కలిగి ఉండే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. వీటిని తట్టుకోవాలంటే వ్యాక్సినేషన్ కవరేజిని పెంచడంతోపాటు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోక తప్పదని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో కొవిడ్ పరీక్షలు చేయడంలో అలసత్వం కనిపిస్తోందని, ఇలా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News