Wednesday, January 22, 2025

ఎన్‌సిపిలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎన్‌సిపిలో బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ చేరారు. కాంగ్రెస్‌లో సీటు రాకపోవడంతో అజిత్ పవార్ వర్గంలో జీషాన్ చేరారు. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ బాంద్రా ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (66)తు అక్టోబర్ 12 సాయంత్రం ముంబై లోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా అతడిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. వెంటనే సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. బాబా సిద్ధిఖీ హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై పది లక్షల రూపాయల రివార్డును ఎన్‌ఐఎ ప్రకటించింది. 2022లో నమోదైన రెండో కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిఖీ హత్యకు ముందు కూడా షూటర్లతో అన్మోల్ ఫోన్‌లో ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి రివార్డు ఇస్తామని ఎన్‌ఐఎ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News