Monday, December 23, 2024

బాబా వంగ 2023 జోస్యం నిజమవుతుందా?…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాబా వంగ బల్గేరియాకు చెందిన ఓ గుడ్డి మార్మికురాలు. 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, డయానా రాణి మరణం, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడవుతాడు అని ఆమె చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆమె 1996లో చనిపోయింది. ఇప్పటి వరకు ఆమె చెప్పిన జ్యోష్యం 85 శాతం మేరకు నిజమయ్యాయి. ఈ ప్రపంచం 5079 వరకు కొనసాగుతుందంది. ఆమె వాంజెలియా గుష్టెరోవ్‌గా జన్మించారు. ‘నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమెకు తన 12వ ఏట చూపుపోయింది. ఆమెకు చూపులేకపోయినప్పటికీ దేవుడు ఆమెకు భవిష్యత్తులో జరుగబోయేది చూడగలిగే శక్తినిచ్చాడంటారు.

2023 సంవత్సరానికి సంబంధించి ఆమె అనేక విషయాలు చెప్పారు. 2023లో భూ భ్రమణం కొంత మేరకు మారుతుందన్నారు. వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఒకవేళ బాబా వంగ జోష్యం అనేది నిజమయ్యేట్లయితే అనేక విధ్వంసకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఒకవేళ భూమి, సూర్యుడికి దగ్గరగా వెళితే రేడియేషన్ పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరోవైపు భూగ్రహం సూర్యుడికి దూరంగా వెళితే చీకటి గంటలు పెరుగుతాయి, మంచు యుగంలోకి మనం వెళతాం. ఇది వరకు ఎన్నడు చూడని సౌర తుఫాను 2023లో మనం చూస్తామన్నారు. ఆమె చెప్పిన ఆ సౌర తుఫాను సాంకేతికతను దెబ్బతీయగలదు. పెద్ద ఎత్తున బ్లాక్ అవుట్స్, కమ్యూనికేషన్స్ ఫెయిల్యూర్స్  ఏర్పడవచ్చు.

ఓ పెద్ద దేశం ప్రజలపై జీవాయుధాల పరిశోధన చేస్తుందని, దాని ఫలితంగా వేలాది మంది చనిపోతారని బాబా వంగ తెలిపింది. 2023లో ఓ అణు కేంద్రం విస్ఫోటనం కూడా జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు.  సహజ జననాలను నిషేధిస్తారని, మానవులను ప్రయోగశాలలో తయారు చేస్తారని కూడా ఆమె తెలిపారు. దీనర్థం ఎవరు పుట్టాలనేది కూడా ప్రపంచ నాయకులు, వైద్య నిపుణులు నిర్ణయిస్తారంట. తల్లిదండ్రులు కేవలం లక్షణాలు, రూపును అంటే- వెంట్రుకలు ఏ రంగులో ఉండాలి, కళ్లు ఏ రంగులో ఉండాలి అనేవి మాత్రం ఎంచుకునే అవకాశం కలిగివుంటారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News