Sunday, January 19, 2025

ఫ్యాన్స్‌తో గొడవ పెట్టుకున్న బాబర్ అజమ్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ వేదికగా ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ జట్టు టి20 సిరీస్ ఆడుతోంది. తొలి టి20, మూడు టి20 వరుణుడు అడ్డురావడంతో మ్యాచ్‌లను రద్దు చేశారు. రెండో మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లాండ్ విజయం సాధించింది. నాలుగు టి20 ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. మూడో టి20 తరువాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. బాబర ఆజమ్ ఇంగ్లాండ్ వీధుల్లో విహరిస్తుండగా అతడిని అభిమానులు చుట్టుముట్టారు. సహనం కోల్పోయిన బాబర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన నుంచి దూరంగా వెళ్లాలని గట్టిగా అరిచాడు. దీంతో అభిమానులు దూరంగా ఉండిపోయారు. తనపైకి రావొద్దని, తాను మాట్లాడుతున్నానని, వీడియో తీయోద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంచెం సేపు తరవాత శాంతించి బాబర్ ఆజమ్ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు బాబర్ ఆజమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ముచ్చటించి ఉంటే బాగుండేందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టుకు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News