దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠభరితమైన పోరుకి సమయం ఆసన్నమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలినట్లు సమాచారం. ఈ మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్ కీలక ఆటగాడు బాబర్ ఆజామ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. దీంతో అతనికి గాయం అయిందని.. మ్యాచ్‌కి కూడా దూరం అవుతాడని వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్ మాట్లాడుతూ.. అది ఒక చిన్న అంశంగా పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్ నుంచి విరామం కావాలని బాబర్ కోరినట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న పాకిస్థాన్ జట్టును ప్రొత్సహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ దుబాయ్‌కి వెళ్లారు. భారత్‌పై ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని ఆయన జట్టు సభ్యులకు ఆయన సూచించారు.