Thursday, January 23, 2025

పాపం పసిబిడ్డలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాపం పసిబిడ్డలు.. అభం శుభం తెలియని పసికందుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. ఓ చోట అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్ల పొదల పాల్జేస్తే.. మరో చోట అప్పుడే పుట్టిన పసికందును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే… మియాపూర్‌లో అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో పడేశారు. మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న చెరువు పక్కన ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో కొందరు దుండగులు ఓ ఆడ శిశువును పడేశారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాప గుక్క పెట్టి ఏడుస్తుండడతో స్థానికులు గమ నించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసు లు పాపను అంబులెన్స్ ద్వారా కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంగా పసికందును వదిలించుకునేందుకు పాప తల్లిదండ్రులు ఇలా పడేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘ టనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని మియాపూర్ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా కరీంనగర్‌లోని మాతా శిశు ఆసుపత్రి నుంచి ఓ పసికందు మాయమైన ఘటన తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ని ర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే నిర్మలా దేవికి చికిత్స కోసం ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు ఉ న్న మంచం దగ్గర తన ఏడేళ్ల కుమారుడిని ఉంచి నిర్మలా దేవితో భర్త మనో జ్ రామ్ వెళ్లాడు. వచ్చి చూస్తే పాప కనిపించలేదు. ఆస్పత్రి మొత్తం వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెం టనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలోని సిసి కెమెరాలను పరిశీలించారు. ఓ మహిళ చిన్నా రిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో దర్శనమిచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News