Sunday, November 24, 2024

బాబు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ ఆరోపణలు

నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డుమార్గంలో
విజయవాడకు తరలింపు సిట్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎపిలో టిడిపి శ్రేణుల నిరసనలు
కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబే

పక్కా ఆధారాలు గుర్తించాం : ఎపి సిఐడి చీఫ్ సంజయ్

బాబుకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి
అరెస్టు వెనుక దురుద్దేశం లేదు : హోం మంత్రి వనిత

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి అక్రమాలకు పా ల్పడ్డారన్న ఆరోపణలపై అప్పటి ముఖ్య మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు నంద్యాలలో శనివారం అరెస్టు చేశారు. తెల్లవారుజాము న చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి డిఐజి రఘు రామిరెడ్డి నేతృత్వంలో వెళ్లిన పోలీసులు అక్కడ కొద్దిసేపు చంద్రబాబును కలవాని ఎఎస్‌జి సిబ్బందికి వివరించారు. అక్కడే ఉన్న టిడిపి నేతలు ఈ సమయంలో తమ నేతతో ఏమి పని అని ప్రశ్నిస్తూ పోలీసులను అడుకునేప్రయత్నం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్ట కేలకు చంద్రబాబును కలిసి అరెస్టునోటీసును వెల్లడించారు. తన పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు పోలీసులను నిలదీశారు. చంద్ర బాబు తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలు రిమాండ్ రిపోర్ట్‌లో తెలియపరుస్తామని, తమ సమయం వృథా చేయవద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించటంలో చంద్రబాబుతోపాటు న్యాయవాదులు కూడా వెనక్కుతగ్గారు. అక్కడే చంద్రబాబుకు వైద్య ప రీక్షలు నిర్వహించారు.

అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు ఆయన వాహనంలోనే భారీ భద్రత మధ్య తరలించారు. చంద్రబాబును తీసుకువెళుతున్న మార్గం లో గిద్దలూరు నుంచి విజయవాడ వరకూ పలు ప్రధాన కేంద్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అం టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఉదయం 8గంటలకు నంద్యాలలో బయలు దేరిన చంద్ర బాబు కాన్వాయ్ 8గంటల అనంతరం విజయవాడకు చే రుకుంది. చంద్రబాబును నేరుగా సిట్ ప్రధాన కార్యాల యానికి తరలించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ నుంచి నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరితోపాటు పలువురు కుటుంబసభ్యలు హుటాహుటిన విజయవాడు సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అంటూ నిరసనలు తెలిపారు.
సిట్ కార్యాలయానికి సిద్ధార్థ్ లూథ్రా
సిట్ కార్యాలయంలో చంద్రబాబు సిఐడి విచారణ సు దీర్ఘంగా కొనసాగుతోంది. సుమారు 3 గంటలకుపైగా బాబును ప్రశ్నిస్తున్నారు.ఇప్పటివరకు విజయ వాడ కోర్టు వద్ద ఉన్న బాబు తరఫు లాయర్ సిద్దార్థ్ లూ థ్రా సిట్ కార్యాలయానికి వచ్చారు. బాబు తరఫున వా దించేం దుకు లూథ్రాను ఢిల్లీనుంచి ప్రత్యేకంగా పిలిపించారు.
చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేశ్
సిట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్న చంద్ర బాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకే శ్, బాలకృష్ణ, బ్రహ్మణి కలిశారు. విచారణ బ్రేక్ మధ్యలో కుటుంబ సభ్యులను కలిసేందుకు బాబుకు సీఐడీ అధికా రులు అనుమతించారు. తరువాత న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్.. బాబును కలిశారు. కాగా సుమారు 3 గంటలకుపైగా అధికారులు బాబును ప్రశ్నించారు.
‘స్కిల్ ’ అవినీతి కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబే
ఆంధప్రదేశ్‌లో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో జరిగిన అవినీతి కుంభకోణంలో అంతిమ లబ్ధిబాదరుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని ఏపి సిఐడి విభాగం ప్రధాన అధికారి ఎన్. సంజయ్ వెల్ల డించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియాలో సిఐడి చీఫ్ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ వివరాలు ,అందుకు సం బంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఈ కేసులో టీ డీపీ అధినేతను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప్పా రు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరె స్టు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుపై మం గళగిరిలో సీఐడీ చీఫ్ మీడియా సమావేశం నిర్వహిం చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభ కోణం జరిగిందన్నారు. ఇందులో రూ.550 కోట్ల మేర అక్రమాలు జరిగాయని గుర్తించామన్నారు. ప్రభుత్వం త న వాటాగా ఇవ్వాల్సిన రూ.371 కోట్లు, డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్లు తేలిందని చెప్పారు.

సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని, ఒప్పందం జరిగే సమయానికి ఆ సంస్థ లేదని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గంటా సుబ్బారావును నియమించారని, ఆయనకు నాలు గు పదవులు కట్టబెట్టారని చెప్పారు.స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన కుట్ర దారు అని, అంతిమ లబ్ధిదారు కూడా ఆయనేనని తెలి పారు. వికాస్ కన్వెల్కర్ సహా ఇతర నిందుతులు ఈ అక్రమాల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. ఈ కేసుల్లో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చే యాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆర్థిక కుంభకోణం లో అప్పటి కార్యదర్శితోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. ఈ కే సులు ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన అరె స్టు అనివార్యం అయిందని స్పష్టం చేశారు
గంటా శ్రీనివాసరావుకు స్టేషన్ బెయిల్
మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం (సెప్టెంబర్ 9న) తెల్లవారుజామున విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎసిపి వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన క్రమంలో మందస్తుగా పోలీసులు గంటా శ్రీనివాస్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులోనే చంద్రబాబుకు వైద్య పరీక్షలు !
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును దాదాపు ఆరు గంటలకు పైగా ప్రశ్నిస్తోంది. సిట్ కార్యాలయం నుంచి నేరుగా కోర్టుకు చంద్రబాబును తరలించారు. కోర్టులోనే చంద్రబాబుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి కాకుండా నేరుగా కోర్టుకే తరలించాలని అధికారులు నిర్ణయించారు.
నడుచుకుంటూ వెళ్లిన పవన్..
విజయవాడకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మొదట జగ్గయ్యపేటలోని కరిపాడు వద్ద పవన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. అక్కడ నుండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత అనుమంచిపల్లి వద్ద మరోసారి అడ్డుకున్నారు. దీంతో అనుమంచిపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేయడంతో పవన్ కల్యాణ్ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News