Wednesday, January 22, 2025

దొంగ చుట్టం ఇప్పుడు వచ్చాడు…. జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు

- Advertisement -
- Advertisement -

బాబు గోగినేని యాక్టివిస్టు కం హ్యుమనిస్టుగా ఉన్న ఆయన బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. బాబు గోగినేని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సెటైర్లు వేస్తాడు. గోగినేని చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. తాత పేరు తనకు పెట్టుకున్నాడు కానీ తాత స్థాపించి వైద్య విశ్వ విద్యాలయానికి తాత పేరును మార్చి అప్పటి ముఖ్యమంత్రి తన సొంత తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు విమర్శించడం చేతకాని, ధైర్యం లేని హీరో అని జూనియర్ ఎన్‌టిఆర్ ఉద్దేశిస్తూ చురకలంటించారు. ఇప్పుడు ఫ్యామిలీ లవ్వు ఒలకబోస్తున్నాడని విమర్శలు గుప్పించారు. దొంగ చుట్టం అని క్యాప్షన్ పెట్టి బాబు గోగినేని ట్విట్ చేశారు. ఎపి అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఘన విజయం సాధించడంతో చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్, పురందేశ్వరీ, శ్రీ భరత్‌కు జూనియర్ ఎన్‌టిఆర్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.  దీంతో జూనియర్ ఎన్ టిఆర్ అభిమానులు గోగినేనిపై మండిపడుతున్నారు. గతంలో జగన్ మోహన్ సిఎంగా గెలిచినప్పుడు ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పలేదని నెటిజన్లు గుర్తు చేస్తన్నారు. ఇప్పుడు గోగినేని పోస్టు వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News