Monday, January 13, 2025

బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ కావడంతోనే వెళ్లాం… ఇంతలోనే ఘోరం జరిగింది: రేవతి భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్ కావడంతో పుష్ప2 సినిమాకువ వెళ్లామని రేవతి భర్త భాస్కర్ తెలిపారు. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారని, పుష్ప2 సినిమాకు వచ్చి భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నానని బాధను వ్యక్తం చేశాడు. తొక్కిసలాట జరగగానే మా బాబు కిందపడిపోయాడని, వెంటనే పోలీసులు స్పందించి సిపిఆర్ చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడని, వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు.

మొదట తన భార్య పిల్లలు లోపలికి వెళ్లారని, అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారని, అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా గుంపు గుంపులుగా అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రస్తుతం మా బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదని మృతురాలు బంధువులు వాపోతున్నారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంధ్య థియేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News