- Advertisement -
పటాన్ చెరు : ఆదర్శప్రాయుడు నవసమాజ స్తాపకుడు బాబు జగ్జీవన్‌రాం అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రాం 37 వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే జిఎంఆర్ పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యకి ్తఅని కొనియాడారు. స్వాతంత్రం సిద్దించిన తర్వాత ఆయన భారత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడన్నారు. అనగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.నేటి తరానికి ఆయన ఆదర్శ ప్రాయుడన్నారు. యువత ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలన్నారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాద వ్,మార్కెట్ కమిటీ చైర్మణ్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ దళిత సంఘాల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -