Monday, December 23, 2024

మహనీయులు పుట్టిన పుణ్య మాసం ఏప్రిల్…

- Advertisement -
- Advertisement -

Babu Jagjivan Ram 115th birthday celebrations in Karimnagar

కరీనంగర్: దేశంలో అట్టడుగువర్గంలో పుట్టి ఆణిముత్యం లాగ వెలిసిన వ్యక్తి బాబూజీ జగ్జీవన్ రామ్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో దళితబందు లబ్దీదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో పుణ్యదాత్రి భారత గడ్డ, ఎందరో మహనీయులు జన్మించిన నేల మనది. ఏప్రిల్ మాసం మహనీయులు పుట్టిన పుణ్య మాసం. బాబూజీ, బాబాసాహెబ్, పూలేలు కేవలం దళితులు, వెనుకబడిన వర్గాల కోసమే కాదు యావత్ ప్రజల కోసం పోరాడారు. ఎక్కడో బీహార్లో పుట్టిన మహానీయుడైన జగ్జీవన్ రాం జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. సుధీర్ఘ కాలం ఉప ప్రదానిగా, రక్షణ, వ్యవసాయ ఇతర శాఖల మంత్రిగా, పార్లమెంటేరియన్గా సేవలందించి నిరాడంబరంగా చాలా సామాన్య జీవితం గడిపి మనందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. సెలవు దినంగా ప్రకటించి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హక్కుల తోపాటు అభివృద్ది పలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. దళితబందు లబ్దీదారులకు చెక్కులను అందజేయడంతోపాటు స్కీం గురించి వారికి సంపూర్ణంగా వివరిస్తూ ఏం బిజినెస్ చేయబోతున్నారనే దానిపై లబ్దీదారులతో మాట్లాడి మంత్రి గంగుల కమలాకర్ తెలుసుకున్నారు.

Babu Jagjivan Ram 115th birthday celebrations in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News