Monday, December 23, 2024

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ… ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని , ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన మార్గం ఎప్పటికీ ఆచరణీయమని అన్నారు. మంచి జాతీయ నాయకుడుగా, పార్లమెంట్ సభ్యులుగా,కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎనలేని సేవలు అందించారని, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధులు ప్రేమ్ కుమార్ జైన్, టి.జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శులు రాజు నాయక్, జక్కిలి ఐలయ్య, ఎస్‌సి సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, దామర సత్యం, ముప్పిడి గోపాల్, కార్యనిర్వక కార్యదర్శి సంధ్యపోగు రాజశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News